నిజామాబాద్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం గణితము-1బి, 2బి, జంతుశాస్త్రము, చరిత్ర ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఉదయం మొత్తం 6735మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 6,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6,085 మంది కి గాను 5,716 మంది హాజరు కాగా 319మంది గైర్హాజరయ్యారు.
ఒకేషనల్ 650మందికి గాను 627 మంది విద్యార్థులు హాజరుకాగా 23 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రఘురాజ్ ఉదయం 4 పరీక్ష కేంద్రాలను, మధ్యాహ్నం 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారూ. ఆర్యనగర్లోని ఎస్సార్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల కాకతీయ మహిళా జూనియర్ కళాశాల నిర్మల ఉదయ జూనియర్ కళాశాల, ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల కంటేశ్వర్లోని ఎస్సార్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యార్థి అధికారి తనిఖీ చేసి సమీక్షించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు 35 పరీక్ష కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 14 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.