రెంజల్, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సర్పంచ్ సునీత నర్సయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే కార్మికుడు పారిశుద్ధ్య కార్మికులేనని వారి సేవలను వెలకట్టలేమని అన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ మస్కుర్ లక్ష్మీ, ఎంపీటీసీ లక్ష్మీ లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, మస్కుర్ ప్రవీణ్,సుధాకర్ రావ్, అనంత్ రావ్,మల్ల సాయిలు, అంగన్వాడీ ఉపశ్యాయురాలు అరుణ, రాణి, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.