పరీక్షలు వెంటనే రద్దు చేయాలి

నిజామాబాద్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీటెక్‌, పాలిటెక్నిక్‌ డిప్లమోకి సంబంధించి విజయా రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే ప్రాక్టికల్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరీక్షలు రద్దు చేయాలని కళాశాల ప్రిన్సిపల్‌ కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం వేణు రాజ్‌ మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ వల్ల విద్యార్థులకు తరగతులు నిర్వహించలేదని, దీనివల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయారని, ఇప్పుడు జెఎన్‌టియు వారు (ఎస్‌బిటిఇటి) స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఉన్నట్టుండి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారన్నారు.

కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లమో, బీటెక్‌ విద్యార్థులకు సంబంధించి నిర్వహించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, చివరి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని పాస్‌ చేయాలని, మిగతా తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని అన్నారు.

ఈ విషయం ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాలు జెఎన్‌టియుకు అలాగే స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారికి విన్నవించాలని నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యు.ఐ తరఫున డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ ప్రధాన కార్యదర్శులు భాను, వేదమిత్ర, అజ్జు, మణి కేతన్‌, వర్ధన్‌, కార్తిక్‌, విశాల్‌, ప్రణీత్‌, ఆకాశ్‌, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »