కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మునిసిపల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో 9 ఏండ్ల సమయంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌ సహకారంతో కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.రూ.214 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ లో ప్రతిపక్ష వార్డులకు సైతం సమానంగా నిధులు ఇచ్చి అన్ని వార్డులను అభివృద్ధి చేశామని తెలిపారు. నిధుల కేటాయింపు పరంగా ఎలాంటి వ్యత్యాసం చూపలేదని చెప్పారు. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి దేవి విహార్‌ వరకు నాలుగు లైన్ల రోడ్లు వేయించినట్లు పేర్కొన్నారు.

టేకిరియాల్‌ చౌరస్తా నుంచి హౌసింగ్‌ బోర్డ్‌ వరకు ఆరు లైన్ల రోడ్లు, సెంటర్‌ లైటింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందిరా గాంధీ చౌక్‌ , నిజాంసాగర్‌ చౌరస్తా, జయప్రకాశ్‌ నారాయణ చౌరస్తా వద్ద జంక్షన్‌ లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు.

పట్టణ ప్రగతి ద్వారా కామారెడ్డి పట్టణం రూపురేఖలు మారాయని తెలిపారు. పట్టణంలో పచ్చదనం పెరిగిందని చెప్పారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో మున్సిపల్‌ లో చేపట్టిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఐదు కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారు.

ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను ఇచ్చారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మున్సిపల్‌ వైస్‌ చైర్పర్సన్‌ ఇందూ ప్రియ, కౌన్సిలర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »