కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ పండగ వేడుకులు శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 29న జరిగే బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు సహకారం అందించాలని తెలిపారు.
గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్తు, తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మునిసిపల్, గ్రామపంచాయతీ, జిల్లా పశు సమర్థక శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.