డిచ్‌పల్లి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. వసతి గృహాల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు తెలంగాణ యూనివర్సిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో సెక్రెటరీ, కమీషనర్ గిరిజన సంక్షేమ శాఖ డా.క్రిస్టినా జడ్ చొంగ్తూ, చీఫ్ ఇంజనీర్, గిరిజన సంక్షేమశాఖ ఎం.శంకర్, టియు ఏ.ఇ. వినోద్ తదితరులున్నారు.