కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలి

కామారెడ్డి, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభుత్వ మరింత దృష్టి పెట్టిందని తెలిపారు. తరగతి గదుల్లోని విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించుకునే వీలుందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నత ఉద్యోగాలు పొందే వీలుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలతో సమానమని భావించాలన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చేది విద్య అని గుర్తించాలని సూచించారు. ఈ నెల 26వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

పదవిలో ఉన్న వ్యక్తులు సమాజంలో ఉన్న వ్యక్తులకు న్యాయం చేయకపోతే పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారు. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 20 వేల కోట్లు రూపాయలు కేటాయించిందని చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. రేపు నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ఆస్తుల కన్నా విద్య ముఖ్యమైనది అని విద్యార్థులు భావించాలన్నారు. విద్యార్థులు చదువును ఆయుధంగా భావించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పించాలని చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరిగిందని పేర్కొన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడలో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు.

అంగన్వాడి భవనం, ప్రాథమిక పాఠశాల అదనపు గదులు, ఉర్దూ మీడియం అదనపు గదుల నిర్మాణాలను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై డాక్యుమెంటేషన్‌ చూపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జెడ్పిటిసి సభ్యురాలు స్వరూప, మాజీ జడ్పిటిసి సభ్యుడు సతీష్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »