నందిపేట్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ పాఠశాలలో విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
ఇందులో భాగంగా, ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , మువ్వన్నల జండాను ఎగరవేయడం జరిగింది, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో, పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంబారు తిరుపతి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో చదువుకొని, తమ పాఠశాల మరియు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పేరు ప్రతిష్టలు, దేశంలోనే సగర్వంగా చెప్పుకోనే స్థాయికి తీసుకెళ్లాలని కోరారు.
కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ సాంబారు వాణి , మరియు ఉప సర్పంచ్ భరత్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోకర్ కృష్ణాజి, ఎస్‌ఎంసి చైర్మన్ అబ్దుల్ బాకీ, మండల మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ కలీం తదితరులు పాల్గొన్నారు.