క్యాసంపల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి కంప్యూటర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఉచిత పుస్తకాలను నోటు పుస్తకాలను, ఉచిత దుస్తులను విద్యార్థులకు అందజేశారు.
కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. ఉప సర్పంచ్ బాలకిషన్, ప్రధాన ఉపాధ్యాయులు తాడ్వాయి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సౌమ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు నరసింహారావు, సురేందర్, సంతోష్, అఖిల్, అజ్జు, మహేశ్వర్ గౌడ్, ప్రకాశం పాల్గొన్నారు.