వేల్పూర్, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోన వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 106 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.
అలాగే కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి, ఫార్మసిస్ట్ ధర్మపురి, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.