డిచ్పల్లి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు
10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 11 వేల 939 మంది నమోదు చేసుకోగా 11 వేల 15 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 924 మంది విద్యార్థులు గైరాజరయ్యారని, ఏడుగురు డిబార్ అయ్యారని తెలిపారు.