ఫుల్‌ బ్రైట్‌ అమెరికా ఫెలోషిప్స్‌ పొందండి

డిచ్‌పల్లి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అమెరికాలో చేయదలిచిన ఉన్నత విద్యాభ్యాసం కోసం, ఉత్తమ పరిశోధన కోసం ‘‘ఫుల్‌ బ్రైట్‌ – నెహ్రూ, ఫుల్‌ బ్రైట్‌ – కలాం ఫెలోషిప్స్‌’’ పొందడానికి ప్రయత్నం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఫుల్‌ బ్రైట్‌ ఇండియా కమీషన్‌, తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘‘ఫుల్‌ బ్రైట్‌ – నెహ్రూ, ఇతర ఫుల్‌ బ్రైట్‌ ఫెలోషిప్స్‌ అవకాశాలు 2022-23’’ అనే అంశంపై అవగాహన సదస్సు ప్రారంభిస్తూ వీసీ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ – ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ష్కాలర్‌ ఫిప్స్‌ (యుఎస్‌ఐఇఎఫ్‌) అత్యంత ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. అమెరికా- భారతదేశాల మధ్య విద్యా, వైద్య, వ్యవసాయ, రసాయన, శాస్త్ర, సాంకేతిక, కంప్యూటర్‌, ఆర్థిక, సామాజిక, సాంస్క ృతిక, భౌగోళిక, కళా, మహిళా సాధికారత రంగాలలో ఆంతరిక సమ్మేళనం కలిగించే దిశగా ఫుల్‌ బ్రైట్‌ ఇండియా కమీషన్‌ పని చేయడం ప్రశంసించదగిన విషయమన్నారు. ఈ సారి భారతదేశంలోని స్టేట్‌ యూనివర్సిటీలకు స్థానం కల్పిస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అవకాశం ఇవ్వడం పట్ల హర్షం ప్రకటించారు.

టీయూలోని సంబంధిత విభాగాల వారు ఫుల్‌ బ్రైట్‌ ఫెలోషిప్స్‌ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. వర్చువల్‌ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కో – ఆర్డినేటర్స్‌గా వ్యవహరించిన సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య కె. శివశంకర్‌, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌ లను వీసీ అభినందించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్‌, ఎడ్యుకేషన్‌, (యుఎస్‌ఏ) కాన్సూలేట్‌, హైదరాబాద్‌ కో- ఆర్డినేటర్‌ మిస్‌ ప్రణీత హేమంత్‌ ‘‘ఫుల్‌ బ్రైట్‌ – నెహ్రూ, ఇతర ఫుల్‌ బ్రైట్‌ షాలర్‌ షిప్స్‌ అవకాశాలు 2022-23’’ అనే అంశంపై అవగాహన కల్పించారు. అమెరికాలోని ఫుల్‌ బ్రైట్‌ సెనెటర్‌ 70 క్రితం ప్రారంభించినప్పటి నుంచి ఈ స్కాలర్‌ షిప్స్‌ వల్ల భారతదేశంలోని దాదాపు 20 వేల మంది లబ్ది పొందారన్నారు.

మాస్టర్స్‌, డాక్టరల్‌, పోస్ట్‌ – డాక్టరల్‌, అకడమిక్‌, ప్రొఫెషనల్‌, ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ సెమినార్స్‌, విజిటింగ్‌ చైర్‌ ప్రోగ్రాం వంటి తదితర కోర్సులకు స్కాలర్‌ షిప్స్‌ అందిస్తారన్నారు. ఒక్కో కోర్సుకు నియమిత కాలపరిధి ఉంటుందన్నారు. అగ్రికల్చర్‌ సైన్స్‌, ఆంత్రోపాలజీ, బయో- ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్స్‌ పాలసీ, ప్లానింగ్‌, ఎనెర్జీ ఆడిరగ్‌, జాగ్రఫీ వంటి తదితర సబ్జెక్టుల్లో అమెరికాలో వివిధ విశ్వవిద్యాలయాలలో గాని, ఇన్సిటిట్యూషన్స్‌ లో గాని చదువుకోనే విద్యార్థులు, పరిశోధకులు ఫుల్‌ బ్రైట్‌ స్కాలర్‌ షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం (2022-23) కోసం ఫిబ్రవరి నెల నుంచే వివిధ ఫెలోషిప్పులకు అప్లికేషన్స్‌ ప్రారంభమయ్యాయని తెలిపారు. ముగింపు సెషన్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యా విధానం, పరిశోధనా నేపథ్యం, వివిధ దేశాలలో శాస్త్రవేత్తలుగా అవార్డు సాధించిన అధ్యాపకులు, పరిశోధకూల వివరాలను వెల్లడిరచారు. గ్రామీణ విద్యార్థులకు గొప్ప అవకాశం లభించనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కో- ఆర్డినేటర్స్‌ సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య కె. శివశంకర్‌, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌ తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »