నిజామాబాద్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. కానీ గత సంవత్సరం మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు పెట్టడానికి తమ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు చేసి వంట చేసిన వాటికి సంబంధించిన ఖర్చులు 8 కోట్ల రూపాయలు జిల్లాకు రావలసిన నేటికి చెల్లించకపోగా ఈ సంవత్సరం కొత్త మెనూ అమలు చేయాలని కార్మికులపై వ్యక్తులు చేస్తూ వారిని మరింత అప్పులపాలు చేసి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 26వ తేదీ సోమవారం నుండి మెరుపు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు.
కావున జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ ఉదయం 10 గంటల వరకు నిజామాబాద్ నూతన కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు బి గంగాధర్, బాలరాజు, గంగమణి, నాగలక్ష్మి, ఉమా, పెద్దమ్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.