జూలై 9 వరకు పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు ఈ నెల 3 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల జూలై 9 వ తేదీ వరకు పెంచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 13 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 15 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 17 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు. అదే విధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి సవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు ఈ నెల 3 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 9 వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ విడుదల చేశారు.

200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 12 వరకు ఫీజును చెల్లించవచ్చన్నారు. కావున డిగ్రీ, బి.ఎడ్‌. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »