బాన్సువాడ, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి రాష్ట్రంలో అధికారం ఇవ్వాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతులు పండిరచిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. అలాగే పేద మధ్యతరగతి ప్రజలకు కుటుంబారంగా తయారైన గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుని ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని దీనిని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి కుమారులైన పోచారం భాస్కర్ రెడ్డి , సురేందర్ రెడ్డి, వారి అనుచరులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు అనే వజ్రాయుధం ద్వారా వారికి బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి పనుల్లో కమిషన్ లేనిదే ఎటువంటి పనులు జరగడం లేదని దీనివలన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేని పనులు చేపడుతూ అధికార పార్టీ నాయకులు గుత్తేదారులుగా అవతారం ఎత్తి లక్షలు దోచుకు తింటున్నారన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు పార్టీ నాయకులు లబ్ధిదారు నుండి లక్షలు తీసుకొని ఇండ్లు ఇచ్చారని, అలాగే ఇతర జిల్లాల వారికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టబెట్టిన ఘనత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కుతుందన్నారు.ఈసారి నియోజకవర్గ ప్రజలు బాన్సువాడ శాసనసభ్యుని మార్పు కోరుకుంటున్నారని కావున రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్ల పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన ప్రజలకు అభయమిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుడాల నాగేష్, నార్ల రాఘవేందర్, రేంజర్ల సాయిలు, కొట్టం గంగాధర్, గొల్ల వెంకన్నయాదవ్, మన్నన్, మాసాని కృష్ణారెడ్డి, సలీం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.