నందిపేట్, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నందిపేట్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు వెల్మల్ రాజన్న, ఎర్రటి మోహన్ మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 12 వందల కోట్లతో దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు. ఇలాంటి పథకం దేశంలోనే నంబర్ వన్ పథకం అని కొనియాడారు. ఎస్‌సి సబ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని కొనియాడారు.
కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంకంపల్లి రవి, బుడ్డ శివ, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సురేష్, గౌరవ అధ్యక్షులు నాగరాజు, మారంపల్లి రాజన్న, జీవన్, సంతోష్ తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులు పొగరి సంజీవ్, లక్కపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.