ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామరెడ్డి, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పైభాగంలో నిర్మిస్తున్న వార్డుల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులను సందర్శించారు.

వైద్య కళాశాలకు కేటాయించిన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కోరారు. పనులను తక్షణమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయిన గదులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్‌ విజయలక్ష్మి, వైద్య కళాశాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »