కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వారితో బాధపడుతున్న యశోద (55) మహిళకు అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడ నాడాలని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. రక్తదానం చేసిన ఆ రక్తదాత వేణుగోపాల్ శర్మకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.