బాన్సువాడ, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం అగస్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరసింహ చారి మాట్లాడుతూ పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అగస్త్య ఫౌండేషన్ వారి పుస్తకాలను ఉపయోగించడం వలన సామాన్య శాస్త్రం పై ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు ఖాళీ సమయాన్ని ఈ పుస్తకలను చదివి విజ్ఞానం పట్ల మరింత రాటుదేలన్నారు. ఈ కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ సభ్యులు శంకర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.