కామరెడ్డి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బి.ఎడ్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చాలా కళాశాలలో ఎన్సిటిఈ నిబంధనలను బి.ఎడ్ కళాశాలలు పాటించడం లేదని, విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఉపాధ్యాయులు ఉండకపోవడాన్ని గమనించామన్నారు.
కొన్ని కళాశాలలో అధ్యాపకులకు 10 నెలల వేతనాలను మాత్రమే ఇస్తున్నారని 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని అన్నారు. నిబంధనలను పాటించని కళాశాలలకు 2023-24 విద్యా సంవత్సరానికి అనుబంధ అనుమతులను యూనివర్సిటీ అధికారులు ఇవ్వకూడదని అన్నారు. కొన్ని కళాశాలలో అర్హత లేనటువంటి అధ్యాపకులు ప్రిన్సిపాల్ లు ఉండడం జరిగిందని వారిని తొలగించి అర్హులైన వారికి నియమించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు సచిన్, జహీరాబాద్ పార్లమెంటరీ ఇంచార్జ్ అంజల్ రెడ్డి పాల్గొన్నారు.