గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట్‌ మండలంలోని సిద్ధాపూర్‌ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభం చేసినట్లు గ్రామ సర్పంచ్‌ పచ్చంటి సత్తయ్య తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సహకారంతో జిల్లాలోనే నూతన గ్రామ పంచాయతీలలో మొట్టమొదటిసారిగా సిద్దాపూర్‌ గ్రామపంచాయతీ భవనానికి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

అన్ని రకాల వసతులతో కూడినటువంటినూతన గ్రామపంచాయతీ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరలోనే అందుబాటులోకి నూతన పంచాయతీ భవనాన్ని తీసుకొస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ భూపాల్‌, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »