ఆర్మూర్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ రాం మందిర్ పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మెమోరీ ట్రైనర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్, జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ అధికారి అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా (గుంజిలు) పై అవగాహన సదస్సు నిర్వహించారు.
జీవన్ రావు మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 14 గుంజిలు తీసినట్లయితే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మెదడు చురుకుగా పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మెహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి రోజు సూపర్ బ్రెయిన్ యోగా చేసినట్లుతే ఏకాగ్రత, జ్ఞాపకాశక్తి పెంపొందుతుంది అని అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తమ చారీ, అరవింద్, రాజశ్రీ, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.