కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆహారభద్రత కార్డులో పేరున్న ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా జులై 10 వ తేదీ నుంచి పంపిణీ చేస్తుందని జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని పద్మ తెలిపారు.
రేషన్ డీలర్లు బియ్యం అర్హత గల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.