కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జూబ్లీహిల్స్ కార్యాలయానికి బదిలీపై వెళ్లడం జరిగింది. ఎస్.ఎస్.నగర్లో తహసిల్దార్ గా పనిచేస్తున్న రవీందర్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా బదిలీపై రావడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవ రావు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.