నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ నులిపురుగుల దినోత్సవం (జూలై 20) కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను, ఆల్బెండజోల్ మాత్రలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్సు హాల్లో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుదర్శన్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.అశోక్ తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో 0 నుండి 19 సంవత్సరాల వయసుగల పిల్లలకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించడం జరుగుతుందన్నారు.