డిచ్పల్లి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్ యాదగిరి, రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు.
రిజిస్టర్ వెంట హాస్టల్ చీఫ్ వార్డెన్ డా. మహేందర్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్స్ అశోక్ వర్ధన్ రెడ్డి, యాదగిరి అసిస్టెంట్ వార్ డేన్స్, డా.గంగా కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ రాజేశ్వరి, కేర్ టెక్కర్స్ క్రాంతి, చౌహన్, రమేష్, పీరు తదితరులు ఉన్నారు.