బాన్సువాడ, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ యువ నాయకుడు కౌన్సిలర్ కాసుల రోహిత్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు కేక్ కట్‌చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి బీర్కూర్ వరకు పార్టీ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసుల రోహిత్ తన తండ్రి అయిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజు దీవెనలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాసుల రోహిత్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు చూపించే ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివని, జన్మజన్మలకు మీకు రుణపడి ఉంటాను అన్నారు. అతి చిన్నతనంలోనే కౌన్సిలర్‌గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వార్డు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజా సమస్యల పట్ల అనునిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కలిసి రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, మంత్రి గణేష్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మండ్లు, అజీమ్, నార్ల రాఘవేందర్, డాక్టర్ రాములు, రేంజర్ల సాయిలు, కొట్టంల గంగాధర్, సతీష్ గౌడ్, జీవన్, రేంజర్ల సాయిలు, బండి సాయిలు యాదవ్, విట్టల్ రెడ్డి, అందేరమేష్, షోహబ్, సలీం, మన్నన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.