సదాశివనగర్, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్ఎస్ నాయకులు రైతులు కలిసి రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు.
దేశంలోనే పంటలు పండిరచడంలో తెలంగాణ రైతులు కేసీఆర్ ఆలోచన విధానం వల్ల రెండో స్థానంలో నిలిచి అన్నపూర్ణగా నిలవడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కడుపు మంటగా మారిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం లేక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రైతుల పట్ల మాట్లాడిన విధానం స్పష్టం చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ టిడిపి రైతుల ఉసురు తీసిందని ఇప్పుడిప్పుడే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ 24 గంటల ఉచిత కరెంటు రైతు బంధు, వరి కొనుగోలు లాంటి కార్యక్రమాలు నిర్వహించి రైతులకు ఆత్మస్థైర్యం పెంచిన ఘనత కెసిఆర్ ప్రభుత్వందే అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఎంత విషయంతో ఉందో రేవంత్ మాటలతో బయటపడిరదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల పట్ల వారి విధానం ఏందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉపసర్పంచ్ దామోదర్, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు గంగారెడ్డి, మండల వడ్డే సంఘం అధ్యక్షుడు శైలేందర్, యూత్ నాయకుడు సతీష్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్, సాకలి సతీష్, పెద్ద వీర గంగాధర్, ఎడ్ల నర్సింలు, సాకలి రాములు, సాకలి గంగయ్య, చిన్న బీర ప్రవీణ్, ఎడ్ల సాయిరాం, చిన్నబీర శంకర్, దళపతి, ఉండేది శేఖర్, సాయిలు, దత్తురావు తదితరులు పాల్గొన్నారు.