బాన్సువాడ, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటుబుక్స్ అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కావున విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే బోధనలు శ్రద్ధగా విని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కుశాల్, ఉపాధ్యాయ బృందం, పంచాయతీ కార్యదర్శి నవీన్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.