నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు.
బాలిలకల పాఠశాలల్లో మహిళలు మాత్రమే అర్హులని వివరించారు. సంబందిత సబ్జెక్టులో పీజీ, బీఈడీతోపాటు టెట్ పాసైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇందల్వాయి బాలికల పాఠశాల విభాగానికి గణితం, ఫిజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం, పీఈటీ కొరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చీమన్‌పల్లి అట్ ఆర్మూర్ బాలుర జూనియర్ కళాశాల విభాగానికి జువాలజీ, ఆంగ్లం పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారని వివరించారు.
పీజీ, బీఈడీలో సెకండ్ డివిజన్, టెట్‌లో ఉత్తీర్ణులవ్వాలన్నారు. ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా డెమో, మెరిట్ ఆధారంగా పూర్తి చేస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 8333925399, 8333925400 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.