దళితరత్న అవార్డు అందుకున్న చేపూర్‌ సర్పంచ్‌

ఆర్మూర్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్నకు మంగళవారం రోడ్డు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేతులమీదుగా దళిత రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్బంగా చేపూర్‌ గ్రామంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు ఆయనను యువజన సంఘాలవారు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా సర్పంచ్‌ సాయన్న మాట్లాడుతూ తాను దళిత రత్న అవార్డు మంత్రి చేతులమీదుగా అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అలాగే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే తనను చేపూర్‌ గ్రామ యువజన సంఘాల ప్రతినిదులు సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానని, వారు ఈ సందర్బంగా తెలిపారు. సన్మానించినవారిలో డాన్‌ సీను, కటికే శివ, వార్డు మెంబర్‌ సొఖం నర్సయ్య, కపిల్‌, సచిన్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »