మోర్తాడ్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగారెడ్డి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తహసిల్దార్ శ్రీధర్, ఏపీఓ శకుంతల, మండల ప్రత్యేక అధికారి బాపురావు, అటవీశాఖ అధికారులు, గ్రామ సచివాలయం సెక్రటరీ రామకృష్ణ, మోర్తాడ్ మాజీ సర్పంచ్ దడివే నవీన్ తదితరులు పాల్గొన్నారు.