కామారెడ్డిలో అగ్నిమాపక అవగాహన సదస్సు

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా జడ్జి మరియు చైర్పర్సన్‌ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధమ శ్రేణి న్యాయమూర్తి భవాని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ మాట్లాడారు జిల్లా న్యాయస్థానంలో పనిచేసే వారికి అగ్నిమాపక సదస్సు ద్వారా అందరికీ గుర్తు చేసే విధంగా చాలా బాగుందని తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ అర్థమయ్యే విధంగా చూపించడం జరిగిందని అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజగోపాల్‌ గౌడ్‌, నంద రమేష్‌, దామోదర్‌ రెడ్డి, అశోక్‌, న్యాయశాఖ ఉద్యోగుల అధ్యక్షులు భుజంగరావు, శ్రీదేవి, శ్రీధర్‌ ,వెంకటరెడ్డి చంద్రసేనారెడ్డి, న్యాయవాదులు శ్యామ్‌ రావు, జగన్నాథం, సిద్ది రాములు, ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ అలీ, రవీందర్‌ రెడ్డి, బాలరాజు, సాయిలు, లక్ష్మణ్‌, జలంధర్‌, వెంకట్‌ శ్రావణ్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »