18న మత్స్య సంఘాల అధ్యక్షుల సమావేశం

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో నూతనంగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘమును రిజిస్ట్రేషన్‌ చేయుట గురించి ఈనెల 18 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి వీక్లీ మార్కెట్‌ సమీపంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్‌ హాలులో జిల్లాలోని అన్ని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తెలిపారు.

సమావేశంలో నూతన జిల్లా మత్స్య సంఘమును రిజిస్ట్రేషన్‌ చేయు విషయంపై చర్చిస్తామని చెప్పారు. తాత్కాలిక కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని పేర్కొన్నారు. నూతన జిల్లామత్స్య సంఘమును రిజిస్ట్రేషన్‌ చేయుటకు ప్రతిపాదనలు తీసుకొనుట గురించి చర్చించనున్నట్లు తెలిపారు. అన్ని మత్స్య సంఘాల అధ్యక్షులు సకాలంలో హాజరై సమావేశంను విజయవంతం చేయాలని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »