కామారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలలో అడ్మిషన్లు ఉన్నాయని, 5వ, 6వ, 7వ, 8వ, 9 వ తరగతులల్లో ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ బాలురకు స్పాట్ అడ్మిషన్ ఇస్తున్నామని ప్రిన్సిపల్ పి. నారాయణ గౌడ్ తెలిపారు.
ఆసక్తి గల వారు సంబంధిత ద్రువీకరణ పత్రాలు తీసుకువస్తే నేరుగా అడ్మిషన్ కల్పిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ధ్రువీకరణ సర్టిఫికెట్లుతో వచ్చి ప్రవేశం పొందాలని పేర్కొన్నారు. ఉచిత విద్య, ఉచిత భోజనం, వసతితో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ (డ్రెస్సులు) కిట్స్ ఇస్తామని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదావకాశాన్ని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్కై జిల్లాలోని మైనార్టీ ముస్లింలు, క్రిస్టయన్ మైనార్టీలు తమ పిల్లలను చేర్పించి చదువులకు బాట వేయాలన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ పి. నారాయణ గౌడ్, ఫోన్ : 9441315327 సంప్రదించాలన్నారు.