శ్రీ గంగా సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను వారిపిల్లలు సరిగ్గా తిండి పెట్టకుండా ఇంట్లో నుండి పంపిస్తున్నారు. చాలామంది ఆకలితో అలమటిస్తూ పస్తులు ఉంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్‌ మరియు అనేక దేవాలయాల వద్ద కడుపు నింపుకోవడానికి బిక్షాటన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు కనీసం తినడానికి తిండి లేక కాళీ కడుపుతో పస్తులుంటున్నారు.

ఇలాంటి వారి కోసం శ్రీ గంగాసాయి ఫౌండేషన్‌ ముందుకు వచ్చి అన్నదానం నిర్వహించింది. కామారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన అడుక్కునే ప్రతి వ్యక్తి యొక్క ఆకలి తీర్చడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. కామారెడ్డి పట్టణంలో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తాము చేసే సేవలో భాగస్వాములు కావాలంటే మీరు కూడా తమతో చేతులు కలపండి అంటున్నారు. ప్రతి ఒక్కరికి కడుపు నింపడమే తమ యొక్క ప్రధాన ధ్యేయమన్నారు. కావున ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్న వారు శ్రీ గంగసాయి ఫౌండేషన్‌ చైర్మన్‌, మేనేజర్లను సంప్రదించి సేవలో భాగస్వాములు కావాలన్నారు. ఫౌండేషన్‌ యొక్క మేనేజర్‌ ఫోన్‌ నెంబర్‌ 8464061219లో సంప్రదించాలన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »