బోధన్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుండి ఖరీఫ్ సాగు కొరకు నిజాంసాగర్ నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమ్మేర్ తెలిపారు. రైతులందరు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండిరచు కోవాలని ఆయన అన్నారు. అదేవిదంగా రెండు మూడు రోజుల్లో అలిసాగర్, ఇతర లిప్ట్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సందర్బంగా బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేసినందుకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ ఆమ్మేర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గత వారం రోజుల నుండి వర్షాలు తక్కువ పడుతున్నందున వరి నాట్లు ఆలస్యం అయితున్నందున రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.