కామారెడ్డి, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై రాజలక్ష్మికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.