నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) పి.యాదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌కు చేరుకుని ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌కు స్వాగతంపలికి, పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన బి.చంద్రశేఖర్ ను సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగిన యాదిరెడ్డిని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.