ఆప్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే అడ్డుకుంటాం

నిజామాబాద్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆదేశానుసారం సోమవారం ఉదయం నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ, పి జి పరీక్షలతోపాటు జెఎన్‌టియు, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారు విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు.

దాదాపు వందమంది పాలిటెక్నిక్‌ విద్యార్థులతో కలిసి గేటుకు తాళాలు వేసి బైఠాయించి పరీక్షలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ధర్నాను విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వేణు రాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ, పీజీ పరీక్షలతో పాటు బీటెక్‌, పాలిటెక్నిక్‌ డిప్లమోకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్ననందున విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నారు.

కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ వల్ల విద్యార్థులకు తరగతులు నిర్వహించలేదని, దీనివల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయారని, ఇప్పుడు జెఎన్‌టియు, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఉన్నట్టుండి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని, కనీసం పరీక్షలకు పదిహేను రోజుల సమయం కూడా ఇవ్వలేదని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లమో, బీటెక్‌ విద్యార్థులకు సంబంధించి నిర్వహించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, చివరి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని పాస్‌ చేయాలని, మిగతా తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలన్నారు.

ఈ విషయం పై జెఎన్‌టియు, స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి నుండి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన వచ్చిన తర్వాతే ధర్నా విరమిస్తానని చెప్పారు. దీంతో పోలీసులు నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యు.ఐ జిల్లా కమిటీ సభ్యులను, నాయకులను బలవంతంగా అరెస్టు అరెస్టు చేయడంతో అక్కడున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ ఉపాధ్యక్షుడు సాయి వరుణ్‌, నిజామాబాద్‌ జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ ప్రధాన కార్యదర్శులు భాను, వేదమిత్ర అధిక సంఖ్యలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »