కామారెడ్డి, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ కొత్త బస్టాండ్లో పేరుకు మాత్రమే ఉచిత మరుగుదొడ్లు. కామారెడ్డి కొత్త బస్టాండ్ మూడు జిల్లాల ప్రజలు కామారెడ్డి నుండి రాకపోకలు జరుగుతాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సులో వెళుతుంటారు. కామారెడ్డి బస్టాండ్ ఆర్టీసీకి సంబంధించిన ఉచిత మరుగుదొడ్లు సరిగా పని చేయకపోవడంతో వాటికి తాళం వేశారు.
సంబంధిత ఆర్టీసీ అధికారులను అడగగా మేము కాంటాక్ట్ పద్ధతిలో కాంట్రాక్టర్ సాయిబాబాకు ఇచ్చాము, కానీ తాను పట్టించుకోవడంలేదని ట్రాఫిక్ సూపర్వైజర్ మంజుల తెలిపారు. ప్రైవేట్ టాయిలెట్స్ టెండర్ ప్రకారం మూడు రూపాయలు తీసుకోవాలని ఉన్నప్పటికీ ట్రాఫిక్ సూపర్వైజర్ మంజుల ముందే ఐదు రూపాయలు తీసుకుంటున్నామని టాయిలెట్ల వద్ద పనిచేసే వర్కర్ నివాస్ కుమార్ తెలిపారు.
కానీ అక్కడికి వచ్చే ప్రజలను అడగగా పది రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.