మైనార్టీల సంక్షేమంపై దృష్టి సారించాలి

కామారెడ్డి, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనారిటీల సంక్షేమంపై దృష్టి సారించాలని జాతీయ మైనారిటీ కమీషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షాహేజాది అన్నారు గురువారం కామారెడ్డి కలెకర్ట్‌ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అమలు ద్వారా చేకూర్చుతున్న లబ్ది గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయం, మైనారిటీ గురుకులాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, మదర్సాల్లో అందుతున్న సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, మైనారిటీలకు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలు, షాదీ ముబారక్‌ లో మైనారిటీలకు చేకూరిన లబ్ది, బ్యాంకుల ద్వారా మైనారిటీలకు అందించిన వివిధ రుణాలు, రెండు పడకల గదుల ఇండ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సమీక్షించారు.

మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ గురుకుల పాఠశాలలు, బ్యాంకింగ్‌, విద్య, రెవిన్యూ, పోలీస్‌ తదితర శాఖల పనితీరునుసమీక్షిస్తూ . మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. మైనారిటీల అభ్యున్నతికోసం కృషి చేయవలసిన భాద్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి పేదల జీవితాలలో మార్పు తీసుకురావాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు.

సమాజానికి మేలు చేకూర్చే పదవుల్లో ఉన్న ఉద్యోగులు సేవాభావంతో విధులు నిర్వర్తిస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి 15 అంశాల కార్యకమంపై ప్రతి మూడు మాసాలకొకసారి కమిటీ సమావేశాలు నిర్వహించాలని, తద్వారా అవగాహన పెరుగుతుందని అన్నారు. జిల్లాలోని వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని రెవిన్యూ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మైనారిటీ సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్‌ భూములను కాపాడడంతో పాటు స్మశానవాటికలకు స్థలాలను కేటాయించాలని, నిబంధనల మేరకు చర్చిల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరగా తగు చర్యలు తీసుకోవలసిందిగా సభ్యురాలు షాహేజాది అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి దయానంద్‌, ఆర్‌.డి.ఓ.లు శ్రీనివాస్‌ రెడ్డి, రాజా గౌడ్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »