కామారెడ్డి, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీలివిప్లవం 2018-19 పధకము, 2020-21,2021-22 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల వాహనములు, మూడు చక్రాల వాహనములు, ఐస్ బాక్సులు సబ్సిడీపై మంజూరు చేయుటకు అర్హత గల అభ్యర్దుల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తెలిపారు.
దరఖాస్తులో వాహనం మోడల్, కంపెనీ తెలియజేస్తూ ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేటగిరీల ప్రకారం అనుమతి పొందిన యూనిట్లు మాత్రమే సప్లయి చేయబడుతాయి. కామారెడ్డి జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ఆసక్తి, అర్హత గల వారందరూ జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి కార్యాలయములో సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పథకము చేపల రవాణా, చేపలతో తయారు చేయబడే ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీవనోపాది పొందే వారి కొరకు ప్రవేశపెట్టబడినది. ఇందులో ఎస్.టి., ఎస్.సి. మహిళలకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీ కలదు. ఇట్టి అవకాశాన్ని అర్హత గలవారందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
- సభ్యులకు చేపల వ్యాపారం / మార్కెటింగ్ / ప్రాసెసింగ్ / విలువ పెంచే ఉత్పత్తుల తయారి / చేపల ఆహార వ్యాపారంలో ముందస్తు అనుభవం కలిగి ఉండాలి లేదా వారు దేనిలోనైనా శిక్షణ పొందటానికి సిద్ధంగా ఉండాలి.
- ఇచ్చిన ప్రయోజనం కోసం వాహనం ఉపయోగించబడకపోతే, వాహనం పంపిణీ చేసిన తేదీ నుంచి 12% వడ్డీతో పాటు సబ్సిడీ రికవరీకి సంబందిత లబ్దిదారులు బాధ్యత వహిస్తారు. చట్టం ప్రకారం తగిన శిక్ష చర్యలను ఎదుర్కొంటారు.
- లబ్ధిదారుల వాటా కోసం లబ్ధిదారులు స్వయంగా చెల్లించవచ్చు లేదా వారు ఏ బ్యాంకు నుండైన ఋణం పొందవచ్చు. అయితే, వాహనాన్ని బ్యాంకుకు హైపోథెకేట్ చేయడానికి ఉండదు.
- సంచార మత్స్య విక్రయ వాహనమును 5 సంవత్సరాల కాలానికి మత్స్య శాఖకు హైపోథెకేట్ చేయాలి.
దరఖాస్తుతో పాటు జత పరచవలసిన పత్రములు :
సభ్యుల గుర్తింపు కార్డు (ఓటరు ఐడి కార్డు / ఆధార్ కార్డు / రేషన్ కార్డు), వివిధ కుటుంబాలకు చెందినట్లు రుజువు (రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు), దరఖాస్తుదారుల యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ, బ్యాంకు రుణం తీసుకుంటున్నట్లయితే, బ్యాంకు నుండి సమ్మతి లేఖ, ఒకరికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండవచ్చును. ఎవరికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, వారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (ఎల్‌ఎమ్‌వి) ఉన్న డ్రైవర్‌ను నియమించుకోవచ్చు. సభ్యుల వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. లబ్దిదారులు వివరణాత్మిక పథక నివేదిక సమర్పించవలెను. సబ్సిడీ కాక లబ్దిదారులు వెచ్చించవలసిన వాటా ధనము లభ్యత లాంటి వివరములు తప్పనిసరిగా పొందుపరచవలెను.
కావున అర్హత, ఆసక్తి ఉన్నవారు ఔత్సహికులైన వారి నుంచి ధరఖాస్తులు ఆహ్వాన్నిస్తున్నాము. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయములో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరములకు, సందేహములకు కార్యాలయ పనివేళల యందు సంప్రదించాలన్నారు.