బోధన్, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెరిపించి ప్రభుత్వపరం చేసి, 2015 సంవత్సరం నుండి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్య కారణాలతో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుని, కబ్జాలకు గురి అవుతున్న నిజాం షుగర్స్ భూములను రక్షించాలనే డిమాండ్‌లతో మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఫోన్ నెంబర్‌కు ఫోన్‌చేసి 8447369369 మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెల్పవలసిందిగా బోధన్ నియోజక వర్గ ప్రజలందరినీ కోరారు. ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అడ్లూరి శ్రీనివాస్ ఒక న్యాయవాద వృత్తిలో ఉండి పోరాటం చేయడం, బోధన్ ప్రజలను కోరడం ఆలోచించవలసిన విషయం. అంతేకాకుండా తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలనే ఉద్యమం ముందుకు సాగాలంటే ఫోన్ నెంబరుకు మిస్ కాల్ ఇచ్చి సంఫీుభావం తెలపాలని అడ్లూరి శ్రీనివాస్ అన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసేదాకా పోరాడుతామన్నారు.