బాల్కొండ, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 521 సంత్సరకాలంగా ఉన్నాటి వంటి పురాతన ఆలయ చరిత్ర అమోఘమని తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి అధికారి డా. రామనాథం అధికారికంగా ఆలయాన్ని తనిఖీ చేసి అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర ఆధారాలు సేకరించి ఆలయానికి భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలు గురించి అంచనాలు వివరాలు ఆలయ సేవకులను అడిగి తెలుసుకున్నారు.
ఆలయ భూములను పరిశీలన చేశారు. అధికారితో ఆలయ సేవకులు బి.అర్.నర్సింగ్ రావు ఆలయ చరిత్ర పూర్వపు ఆధారాలు, అల్లకొండ చరిత్ర పుట్టు పూర్వోత్తరాలు అధికారికి వివరించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారి కీ.శే. ఆకెళ్ళ విభూషణ శర్మ కుమారుడైన ఆకెళ్ళ దశకంఠ శాస్త్రి శ్రీ నిమిషంభ ఆలయాన్ని
సదర్శించి ఆయన స్వయంగా రచించిన శ్రీ నిమిషంభ శతకం పుస్తకం గురించి అధికారి హర్షం వ్యక్తం చేశారు.
అధికారి వెంబడి ఆలయ పూజారి బి.కృష్ణ రావు జోషి, నర్సింగ్ రావు, చౌదరీ బి. గంగాధర్, బి.రవి కిరణ్, బి.సత్యనారాయణ, బి.నరేష్ కుమార్, బి.వరుణ్, బి.విష్ణు వర్ధన్, బి.నర్శవ్వ ఉన్నారు.