కామారెడ్డి, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ సీఐ నరేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ నరేష్ మాట్లాడారు సర్ప్రైజ్ వాహనాల తనిఖీలో భాగంగా ద్విచక్ర, వాహనాల తనిఖీలు, ఫోర్ వీలర్స్ వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర ఫోర్ వీల్స్ వాహనదారులు తమ వాహనానికి సంబంధించినటి ధ్రువ పత్రాలను వెంటబెట్టుకోవాలని, ఫోర్ వీలర్స్ వాహనాలు వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని, చలాన్ ఏమైనా పెండిరగ్ ఉంటే కట్టుకోవాలని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వలన నీ ప్రాణనికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని, పోలీసులకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాములు, ట్రాఫిక్ ఎస్‌ఐ వినయ్ సాగర్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ హజార్, మురళి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.