బాన్సువాడ, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్‌ను సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒకసారి నియోజకవర్గానికి రావలసిందిగా ఎఐసిసి కార్యదర్శిని వారు కోరారు.
ఈ సందర్భంగా ఏఐటిసి కార్యదర్శి పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఆయన నాయకులకు సూచించారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ కూనిపూర్ రాజిరెడ్డి, దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.