కామరెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ లోని ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎలక్ట్రానిక్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా ఓటింగ్ చేసి వాటిని పరిశీలించారు. ప్రతిరోజు కొత్త ఓటర్లు ఈ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ చేసే విధానంపై చైతన్య పొందాలని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు అనిల్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.