మోర్తాడ్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని సంఘ భవనంలో మండల గంగపుత్రులు సోమవారం సమావేశమై తమ పొట్ట కొట్టే జీవో 6 ను వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు మోర్తాడ్ మండల గంగపుత్ర సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్. రాములు తెలిపారు. సమావేశానికి జిల్లా గంగపుత్రుల చైతన్య సంఘం అధ్యక్షులు నరసయ్య పాల్గొని పోస్టు కార్డుల ఉద్యమంపై అవగాహన కల్పించారు.
సమావేశంలో మండల గంగపుత్రులు ఎదుర్కొంటున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గంగపుత్రుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 6 వెంటనే రద్దు చేయాలని, గంగపుత్ర సొసైటీలు ఉన్న చోట ఇతర కులాల వారికి సభ్యత్వం ఇవ్వరాదని, గంగపుత్రులు ఎదుర్కొంటున్న దాడులను ఎస్సీ, ఎస్టీ సమగ్ర రక్షణ కల్పించి వారికి రక్షణ కల్పించాలని అన్నారు.
గంగపుత్రులకు ప్రత్యేక మత్స్య పారిశ్రామిక కార్పోరేషన్ చట్టం ఏర్పాటు చేయడం గ్రామాలలో గంగపుత్రులపై గ్రామాభివ ృద్ధి కమిటీల దౌర్జన్యం అరికట్టాలని, గంగపుత్రులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గంగ పుత్రులు ప్రతి కుటుంబ సభ్యులు 500 పోస్ట్ కార్డుల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు మగ్గిడి శంకర్, ప్రవీణ్, సతీష్, సత్యనారాయణ, గంగారాం, గంగాధర్, చిన్న శంకర్ తదితరులు పాల్గొన్నారు.