ఆర్మూర్, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు,
జై శ్రీరామ్, జై హనుమాన్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ గత పది వారాలుగా ఆలయములో హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ఆలయ కోశాధికారి ఎర్ర భూమయ్య, సంఘము నర్సయ్య, ఎల్టీ కుమార్, ఎల్.సాయన్న, బొల్లు జీవన్, ఎస్.గణపతి, సిహెచ్.నరహరి, ఇట్టెం సాయన్న, ముత్తేన్న, రవి, నారాయణ, విఠల్, నరేందర్, సాయినాథ్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.